ఫాలున్ గాంగ్‌పై చైనా ఊచకోతకు నిరసనగా ప్రత్యేక కార్యక్రమం

ABN , First Publish Date - 2020-07-20T23:01:27+05:30 IST

చైనాలో ఫాలున్ గాంగ్ మార్గాన్ని అనుసరించే వారిపై జరిగిన ఊచకోత ఘటనకు నేటితో 21 ఏళ్లు.

ఫాలున్ గాంగ్‌పై చైనా ఊచకోతకు నిరసనగా ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్: చైనాలో ఫాలున్ గాంగ్ మార్గాన్ని అనుసరించే వారిపై జరిగిన ఊచకోత ఘటనకు నేటితో 21 ఏళ్లు. 1999లో సరిగ్గా ఇదే రోజు రాత్రి ఫాలున్ గాంగ్ సభ్యులను ఊచకోత కోసింది చైనా ప్రభుత్వం. నేటికీ ఫాలున్ దాఫా సభ్యులపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ అమానవీయ చర్యలకు నిరసనగా వివిధ దేశాల్లో ఏటా ఈ రోజున నిరసన కార్యక్రమాలు జరుగుతుంటాయి. నగరంలోని మాసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న శాంతి నగర్ పార్క్‌లో ఫాలున్ దాఫా సభ్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పాదచారులకు ఫాలున్ దాఫాపై అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాలున్ గాంగ్ సభ్యులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయ సమాజం గొంతు విప్పాలని కోరారు. Updated Date - 2020-07-20T23:01:27+05:30 IST