చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
ABN , First Publish Date - 2020-06-23T21:49:59+05:30 IST
చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేశారు.

హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేశారు. ఈ సందర్భంగా పూజారి రంగరాజన్ మాట్లాడుతూ అహోబిలం లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలో ఉండే అర్చకస్వామికి కరోనా పాజిటీవ్ వచ్చిందని, దీంతో అధికారులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దేవాలయం మూసివేయాలని నిర్ణయించారని... అర్చకుడు సమాజహితం కోసం పనిచేపేవాడని, భక్తులకు దర్శనం చేయించే క్రమంలో అతనికి కరోనా వచ్చిందన్న విషయం భక్తులు గమనించాలన్నారు.
కొన్ని మీడియా చానళ్లలో అర్చకుడికి కరోనా విషయాన్ని హేళనగా చూపించారని రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మనిషికి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయన్నారు. మాస్కులు, సామాజిక దూరం పాటించినా కొంతమందికి కరోనా వచ్చే అవకాశం ఉందని రంగరాజన్ అన్నారు. కరోనా అనేది వ్యాధి అని.. అందుచేత అర్చకుడిని హేళన చేయవద్దని ఆయన కోరారు. చిలుకూరు ఆలయం మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగవంతుని దర్శనం కొన్ని రోజుల పాటు భక్తులకు అందుబాటులో ఉండదని రంగరాజన్ తెలిపారు.