బాలల హక్కులను కాపాడాలి

ABN , First Publish Date - 2020-11-07T09:44:22+05:30 IST

బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు ఎ. శోభారాణి అన్నారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో ఆమె

బాలల హక్కులను కాపాడాలి

 రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు శోభారాణి


కృష్ణకాలనీ, నవంబరు 6: బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు ఎ. శోభారాణి అన్నారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో ఆమె శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోకెల్లా మహిళా శిశుసంక్షేమశాఖ చాలా ప్రధానమైందని, అప్పుడే పుట్టిన శిశువు నుంచి.. వృద్ధుల వరకు అన్నీ రకాల సేవలను ఆ శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. సంక్షేమశాఖలోని సబ్‌ విభాగాలన్నీ సమన్వయంగా బాలల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని అరికట్టి బాల్యవివాహాలను ప్రోత్సహిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. జిల్లాలో స్పాన్సర్‌షిప్‌ పథకానికి అర్హులైన బాలలకు చెక్కులు పంపిణీ చేశారు.


అనంతరం గణపురం ఎక్స్‌రోడ్‌లోని హోం ఆఫ్‌లవ్‌ బాలసదనాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీసీపీవో హరికృష్ణ, సీడీపీవోలు రాధిక, అవంతి, జిల్లా వెనుకబడిన అభివృద్ధిశాఖ అధికారి శైలజ, డాక్టర్‌ ఉమాదేవి, ఏఎల్‌వో సూపర్‌వైజర్లు, విద్యాశాఖ ఏడీ, మైనార్టీ, ఎస్సీ, పోలీస్‌, చైల్డ్‌లైన్‌ అధికారులు, సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-07T09:44:22+05:30 IST