ముంబై మురికివాడల్లో వీధులకు పిల్లల పేర్లు
ABN , First Publish Date - 2020-05-09T09:57:22+05:30 IST
ముంబైలోని మురికివాడల పిల్లల్ని బడికి పంపేందుకు అక్కడి అధికారులు చేపట్టిన చర్యలు బాగున్నాయని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. పిల్లలను బడికి
హైదరాబాద్, మే 8(ఆంధ్రజ్యోతి): ముంబైలోని మురికివాడల పిల్లల్ని బడికి పంపేందుకు అక్కడి అధికారులు చేపట్టిన చర్యలు బాగున్నాయని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. పిల్లలను బడికి పంపేందుకు మురికివాడల్లోని వీధులకు అక్కడి పిల్లల పేర్లను పెట్టడం మంచి ఆలోచనగా శుక్రవారం ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా జత చేశారు. పిల్లల్ని బడికి పంపించేందుకు ఇది అద్భుతమైన మార్గమన్నారు.
హెచ్చార్సీ విచారణలు వాయిదా
లాక్‌డౌన్‌ను ఈనెల 29వరకు పొడిగించడంతో మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ) తన విచారణలను వాయిదా వేసింది. మే 11 నుంచి 29వరకు జరగాల్సిన విచారణలను జూన్‌కు వాయిదా వేశారు. సమాచారం కోసం 9963141253/9000264345 నెంబర్లలో సంప్రదించాలని హెచ్చార్సీ ఇన్‌చార్జి కార్యదర్శి తెలిపారు.