బాల్య వివాహం పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-05-19T00:48:31+05:30 IST

అభం శుభం తెలియని మైనర్‌బాలికను వివాహం చేసుకున్న వ్యక్తినే కాకుండా వివాహనం జరిపంచిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌చేసింది.

బాల్య వివాహం పై చర్యలు తీసుకోవాలి

హైదరాబాద్‌: అభం శుభం తెలియని మైనర్‌బాలికను వివాహం చేసుకున్న వ్యక్తినే కాకుండా వివాహనం జరిపంచిన వారిపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌చేసింది. రంగారెడ్డిజిల్లా ఫరూక్‌నగర్‌ మండలం అయ్యవారి పల్లికి చెందిన మల్లేష్‌ ఇద్దరి పిల్లకలు తండ్రి అయినా భార్య చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలికతో ఈనెల 15న గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈఘటనలో ఈ వివాహాన్ర్ని ప్రోత్సహించిన గ్రామ పెద్దలు, పెళ్లి చేసుకున్న మల్లేశ్‌ పై బాల్య వివాహ నిరోధక చట్టం , అత్యాచారం, అక్రమ నిర్బంధం తదితర నేరాల కింద కేసు నమోదు చేయడంతో పాటు గ్రామ సర్పంచ్‌, అంగన్‌వాడి కార్యకర్తలను బాధ్యులను చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-19T00:48:31+05:30 IST