హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. మెదక్‌లో పట్టుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-06-23T02:08:31+05:30 IST
బోయిన్‌పల్లిలో మూడేళ్ల చిన్నారి సరిత కిడ్నాప్‌కు గురైంది. ఓ మహిళ పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో...

సికింద్రాబాద్: బోయిన్‌పల్లిలో మూడేళ్ల చిన్నారి సరిత కిడ్నాప్‌కు గురైంది. ఓ మహిళ పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీని ఆధారంగా బోయిన్‌పల్లి పోలీసులు.. మెదక్ జిల్లా రామాయంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితురాలు... పాపను నిజామాబాద్‌కు బస్సులో తీసుకెళ్తుండగా రామాయంపేట పోలీసులు పట్టుకున్నారు. అనంతరం బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన ఆంజనేయులు, స్వరూప దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును ఛేదించారు.