బాలుడిని మింగిన బోరుబావి

ABN , First Publish Date - 2020-05-29T09:50:32+05:30 IST

ఆ కుటుం బం చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. మూడేళ్ల సాయివర్ధన్‌ ప్రాణాలను బోరుబావి మింగేసింది. 11గంటలపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టినా బాలుడి మృతదేహాన్నే వెలికితీయగలిగారు. కళ్ల ముందు

బాలుడిని మింగిన బోరుబావి

  • ఫలించని 11గంటల సహాయక చర్యలు
  • 17 అడుగుల లోతులో ఊపిరాడక మృతి 
  • బావిలోకి జారగానే  రక్షించేయత్నం
  • పై నుంచి లోపలికి జారిన మట్టి పెళ్లలు
  • లోపలికి ఆక్సిజన్‌ పైపు వదిలినా అందని గాలి

మెదక్‌/పాపన్నపేట(ఆంధ్రజ్యోతి) మే 28: ఆ కుటుం బం చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఏదైతే జరగకూడదని అనుకున్నారో అదే జరిగింది. మూడేళ్ల సాయివర్ధన్‌ ప్రాణాలను బోరుబావి మింగేసింది. 11గంటలపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టినా బాలుడి మృతదేహాన్నే వెలికితీయగలిగారు. కళ్ల ముందు జారిపడిన బిడ్డ, విగతజీవిగా బయటపడటాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండ లం పొడ్చనల్‌పల్లిలో బుధవారం పొలం వద్ద బోరు వేస్తుండటాన్ని చూసేందుకు వెళ్లిన సాయివర్ధన్‌, ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. సాయంత్రం ఐదుగంటలకు ఈ ఘటన జరగ్గా.. 108 సిబ్బంది అక్కడికి చేరుకొని బోరుబావిలోకి ఆక్సిజన్‌ పైపును వదిలారు. బోరుబావికి కొద్ది దూరంలో సమాంతరంగా మూడు యంత్రాల సాయంతో 22 అడుగుల లోతు గొయ్యి తీశారు.


రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి చేరుకు న్న ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు.. ప్రత్యేక పరికరాలు, కెమెరాలను గుంతలోకి జారవిడిచి బాలుడిని గుర్తించాయి. వారి సూచన మేరకు అప్పటికే తవ్విన గొయ్యి పనులను నిలిపేసి బోరుబావికి మీటరు దూరంలో సుమారు 20 అడుగుల లోతున మరో గొయ్యి తవ్వారు. విజయవాడ నుంచి అర్ధరాత్రి 2 గంటలకు మరో ఎన్‌డీఆర్‌ఎ్‌స బృం దం అక్కడికి చేరుకుని సుమారు 17 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు గుర్తించింది. సమాంతరంగా తవ్విన గొయ్యి నుంచి ఏర్పాటు చేసిన రంధ్రం ద్వారా బోరుబావిలోకి వెళ్లిన ఎన్‌డీఆర్‌ఎఎ్‌ఫ సభ్యుడు గురువారం తెల్లవారుజామున 4:30 గంటలకు బాలుడిని బయటకు తెచ్చా డు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా, అనుమతి లేకుండా బోరు తవ్వడమే కాకుండా అజ్రాగత్తగా వ్యవహరించిన బోరు రిగ్గు యజమానిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేంరద్‌ రెడ్డి, కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే, అడిషనల్‌ కలెక్టర్‌ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రి హరీశ్‌ఫోన్‌ద్వారా సూచనలు చేశారు.  


మట్టిపెళ్లలు పడేందుకు అదే కారణమా? 

సాయి వర్ధన్‌ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు. బోరుబావిలో పడే క్రమంలో నుదుటిపై గీతలు పడ్డాయి.  8 నుంచి 9 గంటల మధ్య ఆక్సిజన్‌ అందక సాయివర్దన్‌  చనిపోయి ఉంటాడని పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. అయితే ఘటన జరిగిన వెంటనే కు టుంబీకులు బాలుడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలతోనే సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిందని అధికారులు భావించినట్లు సమాచారం. బాలుడి తాత భిక్షపతి తన దోతి విప్పి దానికి ఓ చీరను ముడివేసి బోరుబావి గుంతలోకి జారవిడిచి దాన్ని పట్టుకోవాలంటూ  కేకలు వేశారు. ఇలా కొంతసేపు య త్నించారు. ఈ క్రమంలో మట్టిపెళ్లలు లోపలికి జారిపడ్డాయి. అలా మట్టిపెళ్లలు పడి గుంత కొంతమేర పూడుకుపోయిందని ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఆ కారణంగానే 108 సిబ్బంది ఆక్సిజన్‌ పైపులైన్‌ను లోపలికి వేసినా సాయివర్ధన్‌ వరకు చేరకుండా మట్టిపెళ్లలు అడ్డుపడి ఉంటాయని, దాంతో ఊపిరాడక గుం తలో పడిన మూడునాలుగు గంటల్లోపే  ప్రాణాలు విడిచి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు.  


బాలుడు పైకి వచ్చేవాడే 

బోరుబావిలోకి ముడివేసి వదిలిన ధోతి, చీరను లోపల ఉన్న సాయివర్ధన్‌ పట్టుకొన్నాడని కుటుంబీకులు చెబుతున్నారు. కొంతమేర పైకి లాగిన తర్వా త అప్పటిదాకా గట్టిగా పట్టుకున్న తాడులాంటి చీరను బాలుడు వదిలిపెట్టాడు. దీంతో మరింత లోతులాకి జారిపోయాడు.  


బోరు గుంతలను పూడ్చేయండి

మునిసిపాలిటీల పరిధిలోని బోరుబావుల గుంతలను వెంటనే పూడ్చి వేయాలని అధికారులను మునిసిపల్‌, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ఆదేశించారు. జూన్‌  1 నుంచి ఎనిమిది రోజుల పాటు చేపట్టే పట్టణ ప్రగతిలో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ఆదేశించారు.

Updated Date - 2020-05-29T09:50:32+05:30 IST