భారత ముద్రలు వాడే ముందు నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2020-06-25T22:29:40+05:30 IST
భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర చిహ్నం (ఎంబ్లమ్) ప్రదర్శన పై తాజా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) వికాస్‌రాజ్ జారీ చేశారు.

హైదరాబాద్: భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర చిహ్నం (ఎంబ్లమ్) ప్రదర్శన పై తాజా మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) వికాస్‌రాజ్ జారీ చేశారు. భారత చిహ్నం(ఎంబ్లమ్)ముద్రలను ఉపయోగిస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలు తప్పని సరిగా ముద్రలు ముద్రించే ముందు అవి సరియైున స్థానంలో ఉండేలా చూసుకోవాలని, భారత చిమ్నం వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అధికారం ఉన్న ప్రభుత్వ సంస్థలు దేవనగరరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అనే నినాదంతో స్పష్టంగా పూర్తి రాష్ట్రచిహ్నాన్ని చిత్రీకరించాలని అన్నారు.
భారత రాష్ట్ర చిహ్నానికి సంబంధించి అసంపూర్తి ప్రదర్శన భారత దేశ రాష్ట్ర చిహ్నం యొక్క ఉల్లంఘన చట్టం-2005, రాష్ట్రచిహ్నం చట్టం -2007 (2010 సవరించబడినది)కిందకు వస్తుందన్నారు. ఈవిషయంలో తగుజాగ్రత్తలు తీసుకోవలని, భారత రాష్ట్ర చిహ్నంను అసంపూర్తిగా ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి నియమ నిబంధనలు బారత వ్యవహారాల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.