చీఫ్ సెక్రటరీ గవర్నర్ పిలుపు.. రాలేమని చీఫ్ సెక్రటరీ సమాధానం

ABN , First Publish Date - 2020-07-06T23:19:08+05:30 IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే సాయంత్రం 4గంటలకు రావాలని చీఫ్ సెక్రటరీ

చీఫ్ సెక్రటరీ గవర్నర్ పిలుపు.. రాలేమని చీఫ్ సెక్రటరీ సమాధానం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులతో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే సాయంత్రం 4గంటలకు రాజ్‌భవన్‌కు రావాలని చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీకి గవర్నర్‌ కబురు పెట్టారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. ముందే నిర్ధేశించుకున్న కార్యక్రమాల వల్ల సమావేశానికి రాలేమని అధికారులు సమాచారం పంపారు. రాలేమని అధికారులు చెప్పడంతో.. మంగళవారం సమావేశం నిర్వహించాలని తమిళిసై భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తిపై గవర్నర్ తమిళిసై ఆందోళన చెందుతున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో పరిస్థితిని సమీక్షంచనున్నట్లు గవర్నర్ ట్వీట్ చేశారు.


రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండు రోజుల పాటు 1800 పైచిలుకు పాజిటివ్‌లు రాగా.. ఆదివారం మాత్రం కాస్త తగ్గి 1590 కేసులే వచ్చాయి. అత్యధికంగా గ్రేటర్‌లో 1277 మంది మహమ్మారి బారినపడగా, మేడ్చల్‌లో 125, రంగారెడ్డిలో 82, సూర్యాపేటలో 23, నల్గొండలో 14, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి జిల్లాలో 19 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. తాజా కేసులతో.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 23,902కు చేరింది. దేశంలో కేసుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానానికి చేరింది.

Updated Date - 2020-07-06T23:19:08+05:30 IST