నాలుగు రోజుల క్రితం కెమికల్ లీక్‌.. గుట్టుచప్పుడు కాకుండా 13 మంది కార్మికులను..

ABN , First Publish Date - 2020-05-24T22:28:44+05:30 IST

చిన్నశంకరంపేట మండలం చందంపేటలోని ఎంఎస్‌ఎన్‌ఫార్మా కంపెనీ వియర్ హౌస్‌ విభాగంలో కెమికల్ లీక్‌ అయింది. దీంతో 13 మంది కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. గుట్టుచప్పుడు...

నాలుగు రోజుల క్రితం కెమికల్ లీక్‌.. గుట్టుచప్పుడు కాకుండా 13 మంది కార్మికులను..

మెదక్‌: చిన్నశంకరంపేట మండలం చందంపేటలోని ఎంఎస్‌ఎన్‌ఫార్మా కంపెనీ వియర్ హౌస్‌ విభాగంలో కెమికల్ లీక్‌ అయింది. దీంతో 13 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా వీరందరికి యాజమాన్యం వైద్యం అందిస్తోంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగింది. బాధితులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి  ఆదివారం పరామర్శించారు. అయితే విషయాన్ని బయటకి పొక్కనీయకపోవడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులను ఆదుకోవాలని, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-05-24T22:28:44+05:30 IST