ఒక్క ఐడియాతో అడవి పందులకు చెక్
ABN , First Publish Date - 2020-12-28T08:52:24+05:30 IST
రైతు సరికొత్త ఐడియాతో తన పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకున్నాడు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో రైతులు వేసిన మొక్కజొన్న, వేరుశనగ పంటలు చేతికొచ్చే సమయంలో అడవి పందులు నాశనం చేస్తున్నాయి

సోన్, డిసెంబరు 27: రైతు సరికొత్త ఐడియాతో తన పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకున్నాడు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో రైతులు వేసిన మొక్కజొన్న, వేరుశనగ పంటలు చేతికొచ్చే సమయంలో అడవి పందులు నాశనం చేస్తున్నాయి. రాత్రి వేళల్లో విద్యుత్తు వైర్లు అమర్చడం, చీరలను అడ్డంగా పెట్టినా ఫలితం కనిపించకపోవడంతో రైతులు జాగారం చేయాల్సి వస్తోంది. అయితే, బద్దం శ్రీనివా్‌సరెడ్డి రూ.600తో ఓ మైకును కొని పంట పొలంలో పెట్టాడు. దాని నుంచి వస్తున్న కేకలు, అరుపుల శబ్దాలకు భయపడిన అడవి జంతువులు పంటల వైపు రావడం మానేశాయి.