సచివాలయం డిజైన్‌లో మార్పులు!

ABN , First Publish Date - 2020-07-20T09:13:48+05:30 IST

నూతన సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ వైభవానికి ప్రతీకగా కొత్త సెక్రటేరియల్‌ ఉండాలని భావిస్తున్న

సచివాలయం డిజైన్‌లో మార్పులు!

  • అధికారులు, ఆర్కిటెక్ట్‌లతో రేపు సీఎం సమీక్ష

హైదరాబాద్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నూతన సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ వైభవానికి ప్రతీకగా కొత్త సెక్రటేరియల్‌ ఉండాలని భావిస్తున్న ముఖ్యమంత్రి.. చెన్నై ఆర్కిటెక్ట్‌లు నివేదించిన డిజైన్‌లో కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. కొత్త సచివాలయ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? తదితర అంశాలపై కేసీఆర్‌ సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతోపాటు ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్‌, పొన్ని హాజరుకానున్నారు. అనంతరం, ఈ అంశాలను కేబినెట్‌ భేటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, భవన నిర్మాణం ప్రారంభించనున్నారు.

Updated Date - 2020-07-20T09:13:48+05:30 IST