ఏపీ, తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌ల మార్పు
ABN , First Publish Date - 2020-11-14T03:49:41+05:30 IST
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను అధిష్టానం మార్చింది. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చౌగను నియమించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా మురళీధరన్ నియమించగా.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌చార్జ్‌లను అధిష్టానం మార్చింది. తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చౌగను నియమించింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా మురళీధరన్ నియమించగా.. సహ ఇన్‌చార్జ్‌గా సునీల్ దేవధర్‌ను కొనసాగించింది. ఇక ఏపీకి చెందిన పురందేశ్వరిని రెండు రాష్ట్రాలకు ఇన్‌చార్జ్‌గా హైకమాండ్ నియమించింది. ఛత్తీస్‌గడ్, ఒడిశా ఇన్‌చార్జ్‌గా పురందేశ్వరిని నియమించింది. ఉత్తరప్రదేశ్ సహ ఇన్‌చార్జ్, అండమాన్ నికోబార్ ఇన్‌చార్జ్‌గా సత్యకుమార్‌ను నియమించింది. కర్నాటక సహ ఇన్‌చార్జ్‌గా డీకే.అరుణకు బాధ్యతలు అప్పగించింది. మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్‌గా మురళీధరరావును నియమించింది. ఇక తమిళనాడు సహ ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.