డీటీసీగా చంద్రశేఖర్‌కు మళ్లీ పోస్టింగ్‌

ABN , First Publish Date - 2020-09-18T10:10:29+05:30 IST

డీటీసీగా చంద్రశేఖర్‌కు మళ్లీ పోస్టింగ్‌

డీటీసీగా చంద్రశేఖర్‌కు మళ్లీ పోస్టింగ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ) పోస్టుకు రాజీనామా చేసిన చంద్రశేఖర్‌గౌడ్‌కు ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్‌ ఇచ్చింది. పునర్నియామక ఉత్తర్వులను జారీ చేసింది. 2019 మార్చిలో జరిగిన కరీంనగర్‌,ఆదిలాబాద్‌, నిజామాబాద్‌,మెదక్‌ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేశారు. దాని కోసం  డీటీసీగా రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై ఓడిపోయారు. 

Updated Date - 2020-09-18T10:10:29+05:30 IST