ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-02T02:50:13+05:30 IST

టీడీసీ సీనియర్ నేతలతో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే: చంద్రబాబు

గుంటూరు: టీడీపీ సీనియర్ నేతలతో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యులకు మాస్కులు, రక్షిత డ్రస్సులు ఇవ్వలేకపోయారని చంద్రబాబు అన్నారు. వైద్యుల పట్ల ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, మార్చిలో ఆదాయం బాగున్నా జీతాలు ఎందుకు చెల్లించలేకపోయారు? అని ప్రశ్నించారు. మార్చిలో వారం రోజులు మాత్రమే లాక్‌డౌన్‌ అయిందని, గత మూడు నెలల ఆదాయ వివరాలను బహిర్గతం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏవో సాకులు చెప్పి ఆర్థిక పరిస్థితి బాగోలేదంటున్నారని చంద్రబాబు విమర్శించారు.

Updated Date - 2020-04-02T02:50:13+05:30 IST