నాణ్యమైన వైద్యం అందించాలి: చాడ
ABN , First Publish Date - 2020-06-11T09:45:17+05:30 IST
నాణ్యమైన వైద్యం అందించాలి: చాడ

హైదరాబాద్, జూన్ 10 ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షలను పెంచాలని, గాంధీ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, అదే సయమంలో తమకు రక్షణ లేదని జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. ఎంతమందికి అయినా వైద్యం అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన వట్టి డొల్ల అని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు.