నలంద విద్యా సంస్థల చైర్మన్‌.. సూర్యనారాయణ రాజు మృతి

ABN , First Publish Date - 2020-09-06T10:19:58+05:30 IST

నలంద విద్యా సంస్థల చైర్మన్‌.. సూర్యనారాయణ రాజు మృతి

నలంద విద్యా సంస్థల చైర్మన్‌..  సూర్యనారాయణ రాజు మృతి

గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూత

వెంగళరావునగర్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ విద్యావేత్త, నలంద విద్యాసంస్థల చైర్మన్‌ మంతెన సూర్యనారాయణ రాజు(76) శనివారం గుండెపోటుతో హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లోని స్వగృహంలో మృతిచెందారు.  పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఈడూరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ రాజు 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. విద్యపై ఉన్న మక్కువతో వెంగళరావునగర్‌లో నలంద విద్యా సంస్థలను స్థాపించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యనారాయణ రాజు చికిత్స పొందుతున్నారు. శనివారం గుండెపోటు రావడంతో ఇంట్లో మృతి చెందారు. 1982లో విద్యాసంస్థలను ప్రారంభించిన ఆయన వేలాది మందికి విద్యాదానం చేయడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయనకు భార్య సరస్వతి, కుమారుడు శ్రీనివా్‌సరాజు, ముగ్గురు కుమార్తెలున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆదివారం ఈఎ్‌సఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారుడు శ్రీనివా్‌సరాజు తెలిపారు. 

Updated Date - 2020-09-06T10:19:58+05:30 IST