చిలకలగూడలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
ABN , First Publish Date - 2020-12-14T03:54:46+05:30 IST
సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రోజురోజుకూ వారి ఆగడాలు శృతిమించుతున్నాయి.

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రోజురోజుకూ వారి ఆగడాలు శృతిమించుతున్నాయి. ఒంటరిగా కాదు.. మహిళలు ఇళ్లల్లో ఉండాలన్న భయపడిపోతున్నారు. చిలకలగూడలో ఓ మహిళ బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గమనించి ఇంట్లోకి దూరి మహిళ మెడలో ఉన్న మంగళ సూత్రం లాక్కొని అక్కడి నుంచి పరారీ అయ్యారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు భయపడిపోయారు. స్థానికులకు ఈ విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చైన్‌స్నాచర్లు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.