అర్హులకు రేషన్‌ కార్డులివ్వండి: చాడ

ABN , First Publish Date - 2020-04-24T10:32:11+05:30 IST

అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అర్హులకు రేషన్‌ కార్డులివ్వండి: చాడ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆరేళ్లుగా రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డుల జారీ చేయడం లేదన్నారు. పెండింగులో ఉన్న దరఖాస్తుల సంఖ్య లక్షల్లో ఉందని, ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టడంలేదని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవాళ్లకు కూడా రేషన్‌, నగదును అందజేయాలని ఆయన కోరారు.  

Updated Date - 2020-04-24T10:32:11+05:30 IST