ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే.. ఎందుకు స్పందించట్లేదు?: చాడ

ABN , First Publish Date - 2020-05-11T21:31:23+05:30 IST

హైదరాబాద్: వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. నేడు మఖ్దూంభవన్‌లో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది.

ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే.. ఎందుకు స్పందించట్లేదు?: చాడ

హైదరాబాద్: వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి కోరారు. నేడు మఖ్దూంభవన్‌లో అఖిలపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాడ మాట్లాడుతూ.. అసంఘటితరంగ కార్మికులకు సహాయం చేయాలన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పేదల బతుకులు భారంగా మారాయన్నారు. నీళ్ల కోసం తెలంగాణ పోరాటం సాగిందని.. కానీ సరైన జల విధానం లేదని చాడ విమర్శించారు. 


పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే... తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జీవో 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు రక్షణలు కల్పించబడ్డాయన్నారు. జీవో 3 వచ్చాక ఏజెన్సీ ప్రాంతాల్లో అక్షరాస్యత పెరిగిందన్నారు. జీవో 3ని సుప్రీంకోర్టు కొట్టేయడంపై ఏపీ, తెలంగాణ అప్పీల్‌కు వెళ్లాలన్నారు. ఆర్డినెన్స్‌ తెచ్చి ఏజెన్సీ ప్రజలకు నమ్మకం కలిగించాలని చాడ వెంకటరెడ్డి కోరారు.

Updated Date - 2020-05-11T21:31:23+05:30 IST