‘సత్ప్రవర్తన ఖైదీలను’ విడుదల చేయండి

ABN , First Publish Date - 2020-07-08T08:16:06+05:30 IST

‘సత్ప్రవర్తన ఖైదీలను’ విడుదల చేయండి

‘సత్ప్రవర్తన ఖైదీలను’ విడుదల చేయండి

సీఎం కేసీఆర్‌కు చాడ వెంకట్‌రెడ్డి లేఖ 


హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన గల ఖైదీలకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇంత వరకు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించలేదన్నారు. జీవిత ఖైదీలుగా ఉన్నవారు క్షణికావేశంలో తెలిసో, తెలియకో చేసిన పొరపాటుకు జీవితాంతం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ మానసిక క్షోభతో శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని అనుమతించాలని కోరారు.  

Updated Date - 2020-07-08T08:16:06+05:30 IST