పోడు సాగుదారులకు పట్టాలివ్వాలి: చాడ

ABN , First Publish Date - 2020-12-10T10:21:12+05:30 IST

పోడు సాగుదారులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఇప్పటి

పోడు సాగుదారులకు పట్టాలివ్వాలి: చాడ

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పోడు సాగుదారులందరికీ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఇప్పటి వరకూ కార్యాచరణకు నోచుకోలేదన్నారు. అధికారుల వేధింపుల కారణంగానే ఖమ్మం జిల్లా కారెపల్లికి చెందిన ఎడవెల్లి వెంకటేశ్వర్లు అనే పోడు  రైతు మంగళవారం మృతి చెందాడని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని చాడ కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు.

Updated Date - 2020-12-10T10:21:12+05:30 IST