ప్రాజెక్టులపై ఆంక్షలు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2020-12-28T04:30:29+05:30 IST

ప్రాజెక్టులపై ఆంక్షలు ఎత్తివేయాలి

ప్రాజెక్టులపై ఆంక్షలు ఎత్తివేయాలి
బుధరావుపేటలో పోస్ట్‌కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

29న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కొనసాగిన ఉత్తరాల యుద్ధం


ఖానాపురం, డిసెంబరు 27: కేంద్రం ప్రాజెక్టులపై ఆంక్షలను ఎత్తి ఎత్తివేయాలని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌ కోరారు. రామప్ప–పాకా ల ప్రాజెక్ట్‌ను కేంద్రం అట్టుకుంటోందని ఆదివారం బుధ రావుపేటలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంత రం కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఉత్తరాలను పోస్ట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకా శ్‌రావు, సర్పంచ్‌ కె.ప్రవీణ్‌కుమార్‌, ఎంపీటీసీ సుభాన్‌బీ,  టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఫ సంగెం : రైతుల ఇబ్బందులను కేంద్రం పట్టించుకో వడం లేదని మండల టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఆదివారం సంగెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన బీజేపీ ప్రభుత్వానికి రైతు లు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేంద్రం తీరుకు 29న కలెక్టరేట్‌ వద్ద చేపట్టే నిరసన కార్యక్రమానికి రైతాంగం తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ జి.సుదర్శన్‌రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షుడు కె.నరహరి, వైస్‌ ఎంపీపీ బి.మల్ల య్య, వరంగల్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ డి.సమ్మ య్య యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట  టౌన్‌: ప్రాజెక్టులపై ఆంక్షలను నిరసి స్తూ ఆదివారం చిన్నగురిజాల, ఆకులతండా, ఇప్పల్‌ తండా, ముత్యాలమ్మతండాల్లో రైతులు ఉత్తరాలను కేంద్రానికి పోస్టు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ, ఉపా ధ్యక్షుడు అల్లి రవి, ఈర్ల నర్సింహరాములు, బి.కిషన్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

చెన్నారావుపేట: తిమ్మారాయిన్‌పహాడ్‌లో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు  కేంద్ర మంత్రికి ఉత్తరాలను రాసి పంపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కె.పావని, ప్రదీప్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కె.మల్లయ్య, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌  బి.తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

దామెర: కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలకు నిరస నగా 29న నిర్వహించే నిరాహారదీక్షను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ మండల అఽధ్యక్షుడు నేరెళ్ల కమలాకర్‌ కోరారు. ఆదివారం దామెర రైతు వేదిక ఆవరణలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. సమావేశంలో ఎంపీపీ కాగితాల శంకర్‌, ఎం పీటీసీల ఫోరం జిల్లా చైర్మన్‌ జి.రామకృష్ణ, మండల చైర్మన్‌ పి.కృపాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ జాకీర్‌, పీఏసీ ఎస్‌ బి.రాజు, పి.సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. 

పరకాలరూరల్‌: కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయాలని రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ చింతిరెడ్డి సాంబరెడ్డి కోరారు. ఆదివారం నాగారంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎ.అశోక్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఏంపీపీ టి.స్వర్ణలత, నాయకులు మద్దేల బాబు, చల్లా దామోదర్‌, కె.సదానందం తదితరులు పాల్గొన్నారు.

నడికూడ: కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే ధర్నాను విజ యవంతం చేయాలని ఎంపీపీ మచ్చ అనసూర్య పిలుపునిచ్చారు. ఆదివారం నడికూడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రైతు కోఆర్డినేటర్‌ బొల్లె భిక్షపతి, మాజీ జడ్పీటీసీ పి.కల్పనాదేవి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బి.నాగిరెడ్డి, సర్పంచ్‌ సాంబశివరెడ్డి త దితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-28T04:30:29+05:30 IST