పోతిరెడ్డిపాడును ఆపివేయాలని ఏపీకి సూచించాం: షెకావత్

ABN , First Publish Date - 2020-12-14T03:47:37+05:30 IST

అక్టోబర్ 2న తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జవాబిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్ -3 ఏర్పాటుకు..

పోతిరెడ్డిపాడును ఆపివేయాలని ఏపీకి సూచించాం: షెకావత్

హైదరాబాద్: అక్టోబర్ 2న తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జవాబిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్ -3 ఏర్పాటుకు కేంద్రానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ, ఏపీ పిటిషన్ల ఉపసంహరణ తర్వాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పారు. గోదావరి, కృష్ణాలో టెలిమీటర్ల ఏర్పాటు వ్యయాన్ని ఇరు రాష్ట్రాలు భరిస్తే ఏర్పాటు చేస్తామని గతంలోనే చెప్పామని గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. పోతిరెడ్డిపాడును ఆపివేయాలని ఏపీకి సూచించామన్నారు. అనుమతులు లేకుండా చేపట్టవద్దని ఏపీకి స్పష్టం చేశామని ఆయన తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ ఈ నెల 11న కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. 

Updated Date - 2020-12-14T03:47:37+05:30 IST