నేడు వరంగల్‌లో కిషన్‌రెడ్డి పర్యటన
ABN , First Publish Date - 2020-12-11T13:39:40+05:30 IST
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు.
వరంగల్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేడు వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేంద్రం నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవనున్నారు. రాబోయే జీడబ్ల్యూఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు. కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.