కరోనా వైరస్ నిర్మూలనకు కార్యాచరణతో వెళ్తున్నాం- సీఎస్
ABN , First Publish Date - 2020-04-26T20:36:07+05:30 IST
తెలంగాణలో కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణతో ముందుకు పోతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ నిర్మూలనకు ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణతో ముందుకు పోతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కంటైన్‌మెంట్ జోన్‌లలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్‌గౌబ వివిధ రాష్ర్టాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో కొవిడ్-19 బాఽరినపడిన వారి ఆరోగ్య పరిస్థితి పై రాజీవ్‌గౌబ ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి కూడా సీఎస్‌ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరించారు. తెలంగాణలో కరోనా బారిన పడినవారు ఎంతమంది? వారిలో వ్యాధి తగ్గి డిశ్చార్చి అయిన వారు ఎంత మంది? మృతిచెందిన వారి గురించి పూర్తి సమాచారాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, హోంశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ రవిగుప్త, ఫైనాన్స్‌శాఖ ప్రిస్సిపల్ సెట్రరీ రోనాల్డ్‌రాస్ తదితరులు పాల్గొన్నారు.