కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి: ఉత్తమ్
ABN , First Publish Date - 2020-10-01T22:09:28+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులతో రైతులు నష్టపోతారని తెలిపారు. కొత్త చట్టంలో మద్దతు ధరను చేర్చలేదని, కార్పొరేట్ సంస్థలు ఆహార ధాన్యాలను బ్లాక్ మార్కెట్ చేసే ప్రమాదం ఉందన్నారు. కార్పొరేట్ సంస్థల మేలు కోసమే వ్యవసాయ బిల్లులు తెచ్చారని ఉత్తమ్ ఆరోపించారు. బిల్లులకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుందని, అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, గాంధీ విగ్రహాల వద్ద నిరసన తెలుపుతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.