బియ్యానికి కేంద్రం నిధులు రూ. 1,100 కోట్లు
ABN , First Publish Date - 2020-05-09T09:51:58+05:30 IST
రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు ఖర్చుచేసినట్లు ఎఫ్‌సీఐ సీఎండీ డీవి ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో 191.62 లక్షల లబ్ధిదారులకు ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ ద్వారా ఈ మూడు నెలల కోసం 2.87
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రూ.1,100 కోట్లు ఖర్చుచేసినట్లు ఎఫ్‌సీఐ సీఎండీ డీవి ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో 191.62 లక్షల లబ్ధిదారులకు ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ ద్వారా ఈ మూడు నెలల కోసం 2.87 లక్షల టన్నుల బియ్యం అందించినట్లు చెప్పారు. అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) లబ్ధిదారులకు నెల వారి 35 కిలోలతోపాటు అదనంగా 5 కిలోల బియ్యం ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏ పరిధిలో లేకుండా రాష్ట్ర పరిధిలో ఉండే 88.60 లక్షల లబ్ధిదారులకు 1.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కిలో రూ.22 చొప్పున అందించినట్లు చెప్పారు.