రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం: హరీశ్‌

ABN , First Publish Date - 2020-09-29T07:50:37+05:30 IST

పన్నులలో మన వాటా మనకు 0ఇవ్వకుండా కేంద్రం రూ.10వేల కోట్లను ఆపి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రం: హరీశ్‌

దుబ్బాక, సెప్టెంబరు 28: పన్నులలో మన వాటా మనకు 0ఇవ్వకుండా కేంద్రం రూ.10వేల కోట్లను ఆపి,  తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు  ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని  రెడ్డిసంఘం భవనంలో  సోమవారం ఆర్‌ఎంపీ, పీఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు.  తెలంగాణకు ఉరితాళ్లుగా మారనున్న వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుంటామని, వ్యవసాయ విద్యుత్తు మీటర్లు పెట్టబోమని చెప్పిన తర్వాతే  బీజేపీ నాయకులు దుబ్బాకలో అడుగు పెట్టి, ఓట్లు అడగాలని ప్రజలు వారిని నిలదీయాలన్నారు. ఉద్యమగడ్డ దుబ్బాక ప్రజలు  బీజేపీ లాంటి రైతు వ్యతిరేక పార్టీలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు.  అభ్యర్థిని నిర్ణయించేది సీఎం కేసీఆర్‌ అని, రామలింగారెడ్డి సతీమణిని గాని, మరెవరినైనా సీఎం నిర్ణయిస్తే మనం కలిసికట్టుగా పని చేయాలన్నారు. పట్టణ పరిధిలో మంత్రి  పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Updated Date - 2020-09-29T07:50:37+05:30 IST