కరోనా నిర్థారణ పరీక్షలను ప్రారంభించిన సీసీఎంబీ

ABN , First Publish Date - 2020-03-30T22:43:30+05:30 IST

కరోనా నిర్థారణ పరీక్షలను సీసీఎంబీ ప్రారంభించింది. గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగుల శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి సీసీఎంబీలోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని

కరోనా నిర్థారణ పరీక్షలను ప్రారంభించిన సీసీఎంబీ

హైదరాబాద్: కరోనా నిర్థారణ పరీక్షలను సీసీఎంబీ ప్రారంభించింది. గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగుల శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. ఇవాళ్టి నుంచి సీసీఎంబీలోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని  సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా చెప్పారు. రోజుకు వందలాది పరీక్షలు నిర్వహించే సామర్థ్యం సీసీఎంబీకి ఉందని తెలిపారు. తక్కువ ఖర్చుతో కరోనాను నిర్థారించే పద్ధతుల్ని రూపొందించామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిర్ణయం సరైనదేనని మిశ్రా స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత వల్ల కరోనా రాదనే పుకార్లను నమ్మొద్దని, ఇటలీ, భారత్‌లో కరోనా మధ్య వ్యత్యాసాలను గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు. కరోనా బలహీనపడుతోందనేది అబద్ధమని కొట్టిపారేశారు. మరో రెండు, మూడు వారాలు క్రమశిక్షణ పాటించాలన్నారు. తర్వాత కూడా సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటేనే కరోనాను పూర్తిగా నిరోధించగలమని మిశ్రా చెప్పారు.

Updated Date - 2020-03-30T22:43:30+05:30 IST