మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు
ABN , First Publish Date - 2020-12-20T04:18:06+05:30 IST
మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు

వరంగల్ టౌన్, డిసెంబరు 19: సీసీఐ గుర్తింపు కేంద్రాల్లో మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేస్తున్నట్లు సీసీఐ వరంగల్ శాఖ డిప్యూటీ మేనేజర్ అమర్‌నాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌శాఖ పరిధిలోని 56 సెంటర్ల ద్వారా కిందటేడుతో పోలిస్తే 48.69 శాతం అధికంగా పత్తి కొనుగోలు చేసినట్లు తెలిపారు. పత్తి కొనుగోలులో తేమశాతం 8 నుంచి 12 వరకు అనుమతిస్తామన్నారు. సీసీఐ కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తితే సంబంధిత మార్కెట్ కార్యదర్శికి, లేదా సీసీఐ డిప్యూటీ మేనేజర్ 0870 2565077/88 నంబర్లలో సంప్రదించాలని కోరారు. రైతులు తమ పత్తిని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అమర్‌నాథ్‌రెడ్డి సూచించారు.