సీసీ కెమెరాల ఏర్పాటులో మనమే టాప్
ABN , First Publish Date - 2020-02-08T00:54:51+05:30 IST
వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, సినిమాధియేటర్లు, షాపింగ్ మాల్స్ , కాలనీలు, బస్, రైల్వేస్టేషన్‌లు ఇలా ఇప్పుడు సీసీ కెమెరాలు తప్పని సరి అయ్యాయి.

వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, సినిమాధియేటర్లు, షాపింగ్ మాల్స్ , కాలనీలు, బస్, రైల్వేస్టేషన్‌లు ఇలా ఇప్పుడు సీసీ కెమెరాలు తప్పని సరి అయ్యాయి. దేశంలోని మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో అగ్రస్థానంలో నిలిచింది. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కూడా ఎంతో సహకరిస్తున్నాయి. నేరాల నియంత్రణతోపాటు నేర పరిశోధనలో కీలకమైన సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు పోలీసుపరిశోదన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డి) విడుదల చేసిన డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదిక వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఏడాది క్రితం వరకూ అన్నిరాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలుపుకుని మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటు కాగా వీటిలో 2,75,528 (65శాతం) కెమెరాలు ఒక్క తెలంగాణలోనే ఉండడం గమనార్హం. తెలంగాణ తర్వాత 40,112 సీసీ కెమెరాలతో తమిళనాడు రెండోస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర(39,587), మధ్యప్రదేశ్ (21,206) నిలువగా 14,770 కెమెరాలతో ఆంప్రప్రదేశ్ ఐదోస్థానానికి పరిమితమైంది. ఇక 19 రాష్ర్టాల్లో బిగించిన సీసీటీవీ కెమెరాల సంఖ్య 1000లోపే ఉండగా ఆరు రాష్ర్టాల్లో వంద కూడా లేవు. ఇక లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ర్టాల్లో ఒక్క సీసీటీవీ కెమెరా లేక పోవడం గమనార్హం.