జీఎస్టీ అధికారిపై సీబీఐ కేసు నమోదు
ABN , First Publish Date - 2020-10-03T09:54:36+05:30 IST
జీఎస్టీ అధికారిపై సీబీఐ కేసు నమోదు
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై జీఎస్టీ అధికారి జనార్దన్‌రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. మాదాపూర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు చేసి రూ.1.27 కోట్ల అక్రమాస్తులను గుర్తించింది. భార్య శైలజ పేరున ఆస్తులను కూడబెట్టినట్లు తెలిపింది. జనార్దన్‌రావు హైదరాబాద్‌లోని జీఎస్టీ భవన్‌లో కంప్యూటర్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2007-2014 వరకు సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడ్డాడు. జనార్దన్‌రావు, ఆయన భార్య ఇద్దరూ ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఆయన భార్యకు ఎలాంటి ఆదాయం రావడంలేదు. ఈ సమాచారంతో సోదాలు చేసిన సీబీఐ అధికారులు.. వారి ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. వారిద్దరి పేర మొత్తం రూ.3.23 కోట్ల స్థిర, చర ఆస్తులున్నట్లు గుర్తించారు. అందులో రూ.1.27 కోట్ల విలువైన ఆస్తులు అక్రమమని గుర్తించారు.