జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలి

ABN , First Publish Date - 2020-04-24T09:40:06+05:30 IST

కరోనాపై పోరాటంలో భాగస్వాములై, నిరంతరం వార్తలందించే జర్నలిస్టులపై కేసులు పెట్టవద్దని ..

జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాలి

డీజీపీకి టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్‌) వినతి


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరాటంలో భాగస్వాములై, నిరంతరం వార్తలందించే జర్నలిస్టులపై కేసులు పెట్టవద్దని టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్‌)రాష్ట్ర నాయకులు డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. జర్నలిస్టులపై ఇప్పటికే పెట్టిన కేసులను ఎత్తివేయాలని  విజ్ఞప్తి చేశారు.  డీజీపీ కార్యాలయంలో గురువారం ఆయనకు వినతి పత్రం అందజేశారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి  మారుతీసాగర్‌,  తెంజు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్‌, ప్రధాన కార్యదర్శి రమణకుమార్‌, సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-24T09:40:06+05:30 IST