ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలి: హైకోర్టు
ABN , First Publish Date - 2020-10-03T22:45:25+05:30 IST
ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది...
హైదరాబాద్: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు విచారిస్తున్న సీబీఐ, ఏసీబీ, ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్ విధానంను హైకోర్టు ప్రకటించింది. విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని, జిల్లాల్లో కోర్టులు తెరిచి భౌతిక విచారణ కొనసాగించాలని తెలిపింది.