హైదరాబాద్: సీసీఎస్‌లో చైనా యాప్‌పై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-09-20T20:49:10+05:30 IST
చైనా యాప్‌పై సీసీఎస్‌లో కేసు నమోదయింది.

హైదరాబాద్: చైనా యాప్‌పై సీసీఎస్‌లో కేసు నమోదయింది. ఉగ్రవాద కోణంలో ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో గేమ్స్ పేరుతో చైనా యాప్‌లకు నిధుల మళ్లింపుపై ఎన్‌ఐఏ అధికారులు సీసీఎస్ నుంచి వివరాలను తీసుకుని పరిశీలిస్తున్నారు. రూ.2 వేల కోట్లకుపైగా చైనాకు తరలించిన కంపెనీలపై నిఘా పెట్టారు. యాప్స్ పేరుతో భారతీయుల వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేన్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ చైనా యాప్‌లపై ఈడీతో పాటు ఐటీ కూడా విచారణ చేస్తోంది.