చెంగిచెర్ల కబేళాలో అక్రమాలపై కేసు

ABN , First Publish Date - 2020-05-18T09:44:27+05:30 IST

చెంగిచెర్ల కబేళాలో అక్రమాలపై కేసు

చెంగిచెర్ల కబేళాలో అక్రమాలపై కేసు

హైదరాబాద్‌ సిటీ, మే 17 (ఆంధ్రజ్యోతి) : చెంగిచెర్ల ఆధునిక కబేళా లీజు పొడిగింపులో అక్రమాలపై సీపీఎం చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త కేసు నమోదు చేసిందని ఆ పార్టీ నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. 70ఎకరాల విశాల ప్రాంగణంలో ఉన్న ఈ కబేళా లీజును 2018 జూన్‌లో మహ్మద్‌ సలీమ్‌ కంపెనీకి నిరవధికంగా పొడిగించారని, యేటా రూ.1.92 కోట్లు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నగరంలోని అతి చిన్న కబేళాలను 2015లోనే రూ.9కోట్లు, రూ.10కోట్లకు కేటాయించగా చెంగిచెర్ల కబేళాను అతి తక్కువగా రూ.1.90కోట్లకు కేటాయించడంలో అక్రమా లు జరిగాయని, విచారణ జరపాలని ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా లీజును రద్దు చేసి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-18T09:44:27+05:30 IST