డాక్టర్లను దుర్బాషలాడిన ఎమ్మెల్యే పీఏపై కేసు
ABN , First Publish Date - 2020-07-27T08:43:39+05:30 IST
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులను దుర్బాషలాడిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పీఏ వడ్డె చైతన్యపై కేసు

మట్టెవాడ, జూలై 26: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులను దుర్బాషలాడిన హుస్నాబాద్ ఎమ్మెల్యే పీఏ వడ్డె చైతన్యపై కేసు నమోదైంది. శనివారం రాత్రి సాయికృష్ణ అనే వ్యక్తి వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి రాగా.. చికిత్స ఆలస్యం చేస్తున్నారని ఆయన వెంట వచ్చిన చైతన్య జూనియర్ డాక్టర్లను దుర్బాషలాడారు. పీజీ డాక్టర్ సౌమ్య ఫిర్యాదు మేరకు చైతన్యపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.