కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుభాష్ రెడ్డిపై కేసు

ABN , First Publish Date - 2020-06-25T18:03:11+05:30 IST

ఎల్లారెడ్డిలోని నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వడ్డేపల్లి సుబాష్ రెడ్డిపై కేసు..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సుభాష్ రెడ్డిపై కేసు

కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డిలోని నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వడ్డేపల్లి సుబాష్ రెడ్డిపై కేసు నమోదైంది. తనకు ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కేటాయించాలని సుభాష్ రెడ్డి వద్దకు వెళితే తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ అరుణ అనే మహిళ ఆరోపించారు. దీంతో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణ మీడియాతో మాట్లాడుతూ పార్టీకి చాలా సేవలు చేశానన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కేటాయించాలని అడిగిన సందర్బంగా సుబాష్ రెడ్డి చాలా అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు. టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశాన్నారు. ఆ తర్వాత  సుబాష్ రెడ్డి తన మనుషులను పంపించి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఇక భరించే ఓపిక లేక పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె చెప్పారు.

Updated Date - 2020-06-25T18:03:11+05:30 IST