కార్టూనిస్టు ఎంఎస్‌ రామకృష్ణ కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-20T07:59:32+05:30 IST

సోషల్‌ కార్టూన్‌లతో తెలుగు పాఠక లోకంలో తనదైన గుర్తింపు చాటుకున్న ఎంఎస్‌ రామకృష్ణ కన్నుమూశారు.

కార్టూనిస్టు ఎంఎస్‌ రామకృష్ణ కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ కార్టూన్‌లతో తెలుగు పాఠక లోకంలో తనదైన గుర్తింపు చాటుకున్న ఎంఎస్‌ రామకృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి వద్ద ప్యాపర్రు. ఎస్‌బీఐలో ఉద్యోగం చేశారు.

తెలుగులో ప్రధాన పత్రికలతో పాటు ఆంగ్ల, కన్నడ, తమిళ పత్రికల్లోనూ రామకృష్ణ కార్టూన్లు ప్రచురితమయ్యాయి.


Updated Date - 2020-12-20T07:59:32+05:30 IST