కరోనా పనిపట్టే.. ఫిలమెంట్‌ రహిత యూవీ-సీ లైట్‌

ABN , First Publish Date - 2020-09-16T10:27:03+05:30 IST

అది ఒక అతినీల లోహిత దీపం (యూవీ-సీ లైట్‌). ఫిలమెంట్‌ కూడా లేదు. అయినా వస్తువులు, ఉపరితలాలను ..

కరోనా పనిపట్టే.. ఫిలమెంట్‌ రహిత   యూవీ-సీ లైట్‌

 నవీపేట వాసి నర్సింహాచారి ఆవిష్కరణ

పనితీరును ధ్రువీకరించిన సీసీఎంబీ


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అది ఒక అతినీల లోహిత దీపం (యూవీ-సీ లైట్‌). ఫిలమెంట్‌ కూడా లేదు. అయినా వస్తువులు, ఉపరితలాలను కరోనా వైర్‌స రహితంగా 99 శాతం కచ్చితత్వంతో శుద్ధి చేయగలదు. నిజామాబాద్‌ జిల్లా నవీపేటకు చెందిన ఔత్సాహిక పరిశోధకుడు మందాజి నర్సింహాచారి ఈ వైవిధ్య భరిత ఆవిష్కరణ చేశారు. దీని పనితీరును పరీక్షించిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ).. నర్సింహాచారి ఆవిష్కరణ సాంకేతిక ప్రమాణాలను అందుకునే స్థాయిలోనే ఉందని ధ్రువీకరించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యూవీ-సీ లైట్‌ను   తీర్చిదిద్దేలా ఆయనతో కలిసి పనిచేసేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వివరాలను సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ధ్రువీకరించారు. నర్సింహాచారిని అభినందిస్తూ తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌(టీఎ్‌సఐసీ) ఓ ప్రకటన విడుదల చేసింది.  

Updated Date - 2020-09-16T10:27:03+05:30 IST