సీఎం కేసీఆర్ ప్రకటన బేఖాతార్... మీడియాపై పోలీసుల ప్రతాపం

ABN , First Publish Date - 2020-03-24T04:39:58+05:30 IST

కర్ఫ్యూ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ కర్ఫ్యూకు మీడియా ప్రతినిధులు సహకరిస్తున్నా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కరోనాపై...

సీఎం కేసీఆర్ ప్రకటన బేఖాతార్... మీడియాపై పోలీసుల ప్రతాపం

హైదరాబాద్: కర్ఫ్యూ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ కర్ఫ్యూకు మీడియా ప్రతినిధులు సహకరిస్తున్నా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కరోనాపై ప్రజలను చైతన్య పరిచేందుకు కష్టపడుతున్నా కనీసం కనికరించడంలేదు. కర్ఫ్యూ నుంచి మీడియా ప్రతినిధులను మినహాయించిన సీఎం కేసీఆర్ ప్రకటనను సైతం బేఖాతరు చేస్తున్నారు. కరోనా నివారణకు తాము సైతం అంటూ మీడియా ప్రతినిధులు నిరంతరం వార్తలు ప్రసారం చేస్తున్నారు. కానీ వీరి శ్రమను మాత్రం పోలీసులు గుర్తించడంలేదు. విధులు ముగించుకుని వెళ్తున్న మీడియా ప్రతినిధులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఐడీ కార్డులు చూపించినా దాడులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటన రామంతపూర్ విశాల్ సూపర్ మార్కెట్ దగ్గర జరిగింది. ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టు యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజం కోసం పోరాడుతున్న జర్నలిస్టులపై దాడులు సరికాదని సూచించారు. శ్రీనివాస్‌పై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-03-24T04:39:58+05:30 IST