తెలంగాణలో కొత్తగా 761 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-27T14:54:42+05:30 IST

తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

తెలంగాణలో కొత్తగా 761 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 761 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,67,665కు చేరింది. 1,448 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 10,839 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,55,378 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా ఇప్పటి వరకు తెలంగాణలో 53,32,150 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read more