తెలంగాణలో కొత్తగా 1481 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-28T15:17:54+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1481 కరోనా కేసులు నమోదు కాగా..

తెలంగాణలో కొత్తగా 1481 కరోనా కేసులు

 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1481 కరోనా కేసులు నమోదు కాగా.. నాలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన పాజిటీవ్ కేసుల సంఖ్య 2,34,1562కి చేరగా.. 1,319 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17,916 యాక్టివ్‌ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 2,14,917 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం ఉదయం ఈ మేరకు బులిటెన్ విడుదల చేశారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 279, మేడ్చల్‌ 138, రంగారెడ్డి 111, ఖమ్మం 82, నల్గొండ 82, భద్రాద్రి 79 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-28T15:17:54+05:30 IST