మలక్‌పేట డీమార్ట్ దగ్గర కారు బీభత్సం
ABN , First Publish Date - 2020-12-15T22:13:24+05:30 IST
మలక్‌పేట డీమార్ట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లింది.

హైదరాబాద్: మలక్‌పేట డీమార్ట్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు గాయపడ్డాడు. బాలరాజు అనే వృద్ధుడు డీమార్ట్‌లో షాపింగ్ చేయడానికి వచ్చారు. అయితే షాపింగ్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు రివర్స్ తీసుకుంటుండగా అదుపు తప్పి చాయ్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.