ఎన్‌హెచ్‌-65పై ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు

ABN , First Publish Date - 2020-05-09T10:05:53+05:30 IST

లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళను స్వరాష్ట్రానికి తీసుకువెళ్లే ప్రయత్నం విషాదాంతమైంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది

ఎన్‌హెచ్‌-65పై ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు

మునగాల, మే 8: లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళను స్వరాష్ట్రానికి తీసుకువెళ్లే ప్రయత్నం విషాదాంతమైంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కోలపూడి ధనలక్ష్మి (46) లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లో తన చెల్లెలు ఇంటికి వచ్చారు.  బాపట్లకు చెందిన నర్రా బసవంత్‌ (22) ఓ రెవెన్యూ అధికారి కారు తీసుకుని గురువారం బాపట్ల నుంచి బయల్దేరి హైదరాబాద్‌ చేరుకున్నాడు. ధనలక్ష్మిని, అదే కాలనీలో నివాసం ఉంటున్న బాపట్ల వాసి సాయిసందీ్‌పను కారులో ఎక్కించకుని హైదరాబాద్‌ నుంచి తిరిగి బయలుదేరాడు. సూర్యాపేట జిల్లా ముకుందాపురం వద్ద జాతీయ రహదారిపై అతివేగంగా కారు నడుపుతూ ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో ధనలక్ష్మి, నర్రా బసవంత్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

Updated Date - 2020-05-09T10:05:53+05:30 IST