హైదరాబాద్ : కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

ABN , First Publish Date - 2020-08-21T03:34:06+05:30 IST

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది...

హైదరాబాద్ : కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై తృటిలో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకెళితే.. యాదగిరి థియేటర్ వద్ద ఇండికా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. డ్రైవర్ సమయస్ఫూర్తితో కారు పక్కకు నిలిపేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా.. సంఘటనా స్థలంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-08-21T03:34:06+05:30 IST