గంజాయి మత్తులో మునిగి తేలుతున్న యువకులు

ABN , First Publish Date - 2020-05-13T19:27:48+05:30 IST

జిన్నారం మండలం పరిసరాల్లో కొందరు యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు.

గంజాయి మత్తులో మునిగి తేలుతున్న యువకులు

మంచిర్యాల జిల్లా: జిన్నారం మండలం పరిసరాల్లో కొందరు యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. పోనకల్ చెరువును ప్రధాన అడ్డాగా మార్చుకుని గంజాయి సేవిస్తున్నారు. అలాగే మరో నాలుగు ప్రాంతాలు గంజాయి అడ్డాలుగా మారాయి. పది రోజుల క్రితం కొందరు యువకులు పోనకల్ చెరువువద్ద గంజాయి సేవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేశామన్నారు. గంజాయి ఘాటు ఈ ప్రాంతాన్ని వదలడంలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more