పదో తరగతి పరీక్షల్ని రద్దు చేయండి
ABN , First Publish Date - 2020-06-01T08:51:36+05:30 IST
కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. పదవ తరగతి పరీక్షల్ని రద్దు చేయాలని రాష్ట్ర మైనారిటీ ఉద్యోగులు, కార్మికుల
- ప్రభుత్వానికి మైనారిటీ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి
కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో.. పదవ తరగతి పరీక్షల్ని రద్దు చేయాలని రాష్ట్ర మైనారిటీ ఉద్యోగులు, కార్మికుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అంతర్గత మూల్యాంకన ప్రాతిపదికన విద్యార్థులందరినీ పై తరగతికి ప్రమోట్ చేయాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే.. అది మరిన్ని సమస్యలకు దారి తీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు ఫారుఖ్ హుేస్సన్ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.