కవిత నామినేషన్‌ రద్దు చేయండి

ABN , First Publish Date - 2020-05-18T09:20:47+05:30 IST

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌తో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నామినేషన్‌ను రద్దు చేయాలని ముఖ్య ఎన్నికల అధికారికి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు విజ్ఞప్తి

కవిత నామినేషన్‌ రద్దు చేయండి

హైదరాబాద్‌, మే 17(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్‌తో పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నామినేషన్‌ను రద్దు చేయాలని ముఖ్య ఎన్నికల అధికారికి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఆస్తులను తక్కువగా చూపించారని, కొన్నింటిని వెల్లడించలేదని చెప్పారు. ఈ వివరాలను తమ పార్టీ ఎన్నికల కమిషన్‌కు నివేదించిందని పేర్కొన్నారు. ఆదివారం రాంచందర్‌రావు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతో బీజేపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు, జడ్పీటీసీని భయపెట్టి ఫిరాయుంపులకు ప్రోత్సహించారని ఆరోపించారు.  ఇంటర్‌ మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న లెక్చరర్లందరికీ ప్రభుత్వం గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-05-18T09:20:47+05:30 IST